అమరావతి గెజిట్ విడుదల

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని ఆకాంక్ష నెరవేరింది. రాజధాని అమరావతి (Amaravati)  గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు రాష్ట్రపతి సంతకం తర్వాత రాజధాని అమరావతి గెజిట్ ను కేంద్ర న్యాయశాఖ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా 2024 జూన్ 2నుంచి ఏపీ రాజధానిగా అమరావతి (Amaravati) అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా, అమరావతి ఏపీ శాశ్వత రాజధానిగా పేర్కొంటూ అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. అంతేకాకుండా బిల్లుకు ఎలాంటి సవరణలు చేయకుండా యథాతథంగా ఆమోదించాయి. దీంతో అమరావతి బిల్లును రాష్ట్రపతికి నివేదించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం పెట్టిన తర్వాత అమరావతి బిల్లు చట్టంగా రూపొందింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>