Mobile Popup Ad
Mobile Popup Ad

అల్లు శిరీష్ వివాహానికి పవన్ కల్యాణ్, నాగబాబులకు ఆహ్వానం

కలం, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్(Allu Sirish) వివాహానికి టైమ్ దగ్గర పడింది. మార్చి 6న అల్లు శిరీష్, నయనికల వివాహం ఎంతో గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే అల్లు వారింట పెళ్లి పనులు మొదలు అయ్యాయి. రీసెంట్‌గా తమ్ముడు వివాహం సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హల్దీ వేడుక కూడా గ్రాండ్‌గా జరిగింది. ఇదిలా ఉంటే తన పెళ్లి మొదటి శుభలేఖను మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులకు అందించిన అల్లు శిరీష్.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), నాగబాబు (Naga Babu) ఫ్యామిలీలను తన వివాహానికి  రావలసిందిగా ప్రత్యేక ఆహ్వానం అందించినట్లు శిరీష్ స్పెషల్ ట్వీట్ చేశాడు. తన తల్లిదండ్రులతో కలిసి వారికి ప్రత్యేక ఆహ్వానం అందించినట్లు అల్లు శిరీష్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>