Mobile Popup Ad
Mobile Popup Ad

బన్నీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ‘రాకా’ కోసం అప్పటివరకు ఆగాల్సిందే!

కలం, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తాజా చిత్రం రాకా (Raaka). ఈ ఏడాది ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్-లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. గుండుతో, కాటుక కళ్లతో అల్లు అర్జున్ సరికొత్త అవతారంలో కనిపించిన ఈ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడమే కాకుండా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ (VFX) హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతుండటం వల్ల ఈ ఏడాది థియేటర్లలోకి రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే.

కాగా, సినిమా విడుదల తేదీకి సంబంధించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ పంపిణీదారుడి సమాచారం ప్రకారం.. డిసెంబర్ 2, 2027న థియేటర్లలోకి రానుంది. అంటే ఈ క్రేజీ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్‌ని వెండితెరపై చూడటానికి అభిమానులు మరో 18 నెలల పాటు వేచి చూడక తప్పదు. నిజానికి డిసెంబర్ నెల అల్లు అర్జున్‌కు బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. ఆయన గత బ్లాక్‌బస్టర్స్ పుష్ప: ద రైజ్, పుష్ప 2: ద రూల్ రెండు కూడా డిసెంబర్‌లో విడుదలై భారీ విజయాలను అందుకున్నాయి. రాకా కూడా డిసెంబర్ మొదటి వారంలోనే విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>