కలం, నారాయణపేట: ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల సుపరిపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ (Narayanpet BJP) పిలుపు మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలో సంపర్క్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘ సభ్యులు, సీనియర్ నాయకులు నాగురావు నామాజీ (Nagurao Namaji).. సమాజంలోని ప్రముఖులను కలిసి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ పథకాలు వివరించారు. “సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్” నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న విధానాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శక్తి పీఠం వ్యవస్థాపకులు శాంతానంద పురోహిత్, వారి తండ్రి, జనసంఘ్ సభ్యులు శ్రీ రామభక్తులు యజ్ఞనారాయణ్ పురోహిత్, అలాగే ఎస్‌ఎస్‌ఎస్ సమాజ అధ్యక్షుడు దేవదత్ ఢగేలను కలిసి వికసిత్ భారత్ లక్ష్యాలు, కేంద్ర ప్రభుత్వ విజయాలు, వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 1వ వార్డు కౌన్సిలర్ సూతారి సత్య రఘుపాల్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ శ్రీ కిరణ్ ఢగే, తదితరులు పాల్గొన్నారు.

