కలం, నిర్మల్: రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు భాగస్వామి కావాలని బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట్‌లోని తన నివాసంలో బీఎల్ఓకు ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు సమర్పించే గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించిందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఓటరు జాబితా కీలకమని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్యూమరేషన్ ఫారాలను సకాలంలో సమర్పించాలని కోరారు.

