నిరుద్యోగుల ఆందోళన.. సీఎం రేవంత్‌కు వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 20 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను (Constable Jobs) భర్తీ చేయాలని నినదించారు. కేవలం 5 వేల ఉద్యోగాల ప్రకటన ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని మండిపడ్డారు.

స్వయానా డీజీపీనే 19 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించినప్పుడు.. ఎందుకు కోత విధిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగులు తల్చుకుంటే.. మరో తెలంగాణ ఉద్యమం మొదలవుతుందని.. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ కదలక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని తేల్చి చెప్పారు.

మంత్రులు మా ముందుకు రావాలి..

అశోక్ నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో ఒక్క పూట భోజనం చేస్తూ.. నిరుద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ ఫీజులు కూడా చెల్లించలేక అవస్థలు పడుతున్నామని.. కానిస్టేబుల్ పోస్టుల కోసం ఎదురు చూస్తుంటే, కేవలం 5 వేల పోస్టులతో సరిపెట్టాలని భావిస్తున్నారని మండిపడ్డారు.

సీఎం రేవంత్ తన మనవడి కడుపు నింపి, నిరుద్యోగుల పొట్ట కొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఎన్నో మాటలు చెప్పిన మంత్రులు.. ఇప్పుడు తమ ముందుకు రావాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>