అప్పటి నుంచి హీరోయిన్లందరూ చీరలే ధరిస్తున్నారు : నటుడు నరేశ్

కలం, డెస్క్ : సీనియర్ నటుడు నరేశ్ (Naresh) మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు. సుహాస్ (Suhas) హీరోగా, శివాని నగరం హీరోయిన్ గా గోపీ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ హే భగవాన్. ఈ నెల 20న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సాయిధరమ్ తేజ్ చీఫ్‌ గెస్ట్ గా వచ్చాడు. ఈవెంట్ లో సీనియర్ నటుడు నరేశ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు సినిమాల్లో కంటే ఇప్పుడు తనకు మంచి పాత్రలు రావడం సంతోషంగా ఉందని తెలిపాడు.

పక్కనే ఉన్న శివానీ నగరం గురించి నరేశ్ (Naresh) మాట్లాడుతూ.. ‘రీసెంట్ గా సినిమా ఈవెంట్ లో ఓ ఘటన జరిగింది. అప్పటి నుంచి అందరూ చీరలు కట్టుకునే కనిపిస్తున్నారు. ఈ ట్రెండ్ బాగుంది’ అంటూ చమత్కరించాడు. దీంతో అందరూ నవ్వేశారు. దండోరా సినిమా ఈవెంట్ లో సీనియర్ నటుడు శివాజీ హీరోయిన్ల బట్టలపై చేసిన కామెంట్లు ఎంత పెద్ద దుమారం రేపాయో చూశాం కదా. ఇప్పుడు నరేశ్ కూడా ఇన్ డైరెక్ట్ గా శివాజీ ఇన్సిడెంట్ ను ఉద్దేశించి మాట్లాడాడు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Read Also: 2013 బెట్టింగ్ స్కామ్‌.. రూ.10 లక్షలు కట్టనున్న ధోనీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>