‘పెద్ది’ కోసం ‘లెనిన్’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

కలం, వెబ్ డెస్క్ : అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా మూవీ ‘లెనిన్’ (Lenin Movie) రిలీజ్ డేట్ వాయిదా పడింది. ‘లెనిన్’ సినిమాని ముందుగా మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్​ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాని ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇటీవలే అనౌన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద క్లాష్ ను నివారించేందుకు మే 1న రావాల్సిన ‘లెనిన్’ను వాయిదా వేశారు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ‘లెనిన్’ చిత్రాన్ని జూన్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. అఖిల్ – రామ్ చరణ్ మధ్య ఉన్న ఉన్న స్నేహానికి నిదర్శనంగా చిత్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ తాజా నిర్ణయం తీసుకుంది.

కాగా, మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ కి ఆడియన్స్ నుంచి స్పందన వచ్చింది. సమ్మర్ కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే రామ్ చరణ్​, అక్కినేని అఖిల్ స్నేహం కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>