నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న అఖండ 2 (Akhanda 2) డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అఖండ 2 టిక్కెట్ ధరలు పెంచుతూ జివో ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 4వ తేదీన ప్రీమియర్ షోకు పర్మిషన్ ఇవ్వడమే కాకుండా టికెట్ ధరను రూ.600గా డిసైడ్ చేసింది.
5వ తేదీ నుంచి 10వ తేదీ దాకా టికెట్ రేటుపై మల్టీప్లెక్స్ లో రూ.100, సింగిల్ థియేటర్ లో రూ.75 వరకు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. 11వ తేదీ నుంచి నార్మల్ రేట్లు ఉంటాయి. అఖండ 2 (Akhanda 2) మూవీపై భారీ హైప్ ఉన్న నేపథ్యంలో రేట్లు పెంచడంపై ఒకింత చర్చ జరుగుతోంది.


