హైదరాబాద్ ORR పై ఎయిర్ ఇండియా బస్సులో మంటలు

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ పెద్ద అంబర్ పేట అవుటర్ రింగ్ రోడ్డు (ORR) దగ్గర అగ్ని ప్రమాదం సంభవించింది. నేడు (మంగళవారం) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఆటోనగర్ వెళ్తుండగా పెద్ద అంబర్ పేట వద్ద ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎయిర్ ఇండియా బస్సులో ఒక్కసారిగా మంటలు (ORR Bus Fire) చెలరేగాయి.

భారీగా మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధం అయింది. దట్టమైన పోగ అలముకోవడంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>