Mobile Popup Ad
Mobile Popup Ad

మారనున్న AIFF పేరు.. కొత్త పేరు ఏంటంటే?

కలం, స్పోర్ట్స్ : భారత ఫుట్‌బాల్‌లో కీలక మార్పుకి రంగం సిద్ధమైంది. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) పేరును ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ భారత్ (FFB)గా మార్చే ప్రతిపాదనకు ప్రత్యేక సాధారణ సమావేశం (SGM)లో ఆమోదం లభించింది. అయితే దీనిపై తుది నిర్ణయం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, ఫిఫా అనుమతుల తర్వాతే వెలువడనుంది. AIFF అధ్యక్షుడు కల్యాణ్ చౌబే మాట్లాడుతూ, పేరు మార్పు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ముందుగా ఈ ప్రతిపాదనను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు పంపుతామని, అక్కడి నుంచి ఆమోదం లభిస్తే మళ్లీ సాధారణ సభ ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

అనంతరం ఫిఫా అనుమతి కోసం పంపనున్నట్లు వెల్లడించారు. అవసరమైన అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే కొత్త పేరు అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో ఇండియన్ సూపర్ లీగ్ (ISL) కొత్త సీజన్ సెప్టెంబర్ 4న ప్రారంభమవుతుందని ప్రకటించారు. అలాగే క్లబ్‌ల ఆధ్వర్యంలో లీగ్ నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. AIFF పేరు మార్పు ప్రతిపాదన భారత ఫుట్‌బాల్ చరిత్రలో ఒక కీలక పరిణామంగా మారింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఫిఫా తీసుకునే నిర్ణయాలపై ఫుట్‌బాల్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>