కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీ క్యాంపు రాజకీయాలు ప్రారంభించింది. తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలను పుదుచ్చేరి సమీపంలోని ఒక రిసార్ట్‌కు తరలించడం తమిళ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. పలనిస్వామి (Palaniswami) ని వ్యతిరేకిస్తూ షణ్ముగం (Shanmugam) వర్గం ఇటీవల టీవీకేకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అదే వర్గం విజయ్‌కు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు పార్టీ నుంచి చేజారిపోకుండా ముందస్తు చర్యగా వారిని పుదుచ్చేరి సమీపంలోని షోర్ త్రిశ్వం రిసార్ట్‌కు తరలించారు. పార్టీ అంతర్గత విభేదాలు, వర్గ పోరాటాలు మళ్లీ బయటపడటంతో తమిళనాడు రాజకీయాలలో కొత్త ఉత్కంఠ నెలకొంది.

