Mobile Popup Ad
Mobile Popup Ad

సిద్దిపేటలో సంచలనం.. కానిస్టేబుల్ దంపతులు అరెస్ట్

కలం, మెదక్ బ్యూరో :  సిద్దిపేట (Siddipet) జిల్లాలో సంచలనంగా మారిన అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు.  రంగనాయకసాగర్ (Ranganayaka Sagar) పరిధిలో ఈ నెల 3వ తేదీన బయటపడిన ఈ ఘటనలో కానిస్టేబుల్ దంపతులు హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడిన కానిస్టేబుల్ ప్రవీణ్‌, విశ్వనాథం అనే వ్యక్తి నుంచి సుమారు రూ.40 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి ఇవ్వాలని విశ్వనాథం ఒత్తిడి చేయడంతో అతడిని హత్య చేయాలని భార్య రజితతో కలిసి పధకం రచించాడు.

ఈ నెల 2న మాట్లాడుదామని చెప్పి విశ్వనాథంను కారులో ఎక్కించుకుని, పెద్దకోడూరు శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడ ప్రవీణ్, రజిత కలిసి విశ్వనాథంను హత్య చేశారు. అనంతరం అతని వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తీసుకున్నారు. హత్య తర్వాత మృతదేహాన్ని రంగనాయక సాగర్ రిజర్వాయర్ సమీపంలోని మల్లన్నసాగర్ గేటు వద్ద పడేసి, దంపతులు హైదరాబాద్‌కు పరారైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణలో కానిస్టేబుల్ దంపతులు చేసిన హత్య బయట పెట్టారు.  ఇదే కానిస్టేబుల్ దంపతులు గత నెలలో ఓ మహిళ మెడలోంచి సుమారు మూడున్నర తులాల బంగారం దొంగిలించిన ఘటన కూడా బయటపడింది. నిందితులైన కానిస్టేబుల్ ప్రవీణ్, అతని భార్య రజితను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>