కలం, వెబ్ డెస్క్: తమిళనాడు పరిస్థితులు, ఏపీ పరిస్థితులు ఒక్కటి కావని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. తమిళనాడులో విజయ్ గెలిస్తే.. దాన్ని జనసేనకు ఆపాదించడం కరెక్ట్ కాదన్నారు. శుక్రవారం మంగళగిరిలో నిర్వహించిన జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు. జనసేన ఆవిర్భావం, అనుభవించిన కష్టనష్టాలను ఆయన కార్యకర్తలకు వివరించారు. ఊర్లో పెండ్లికి కుక్కల హడావుడి అన్నట్టుగా రాష్ట్రంలో కొంతమంది వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
కమ్యూనిస్టుల నుంచి నేర్చుకోవాలి
జనసేన రైట్ వింగ్ కాదు.. లెఫ్ట్ వింగ్ కాదని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. కమ్యూనిస్టుల నుంచి జాతీయవాదుల నుంచి తాము మంచిని తీసుకొని ముందుకు సాగుతున్నామన్నారు. ఒకేసారి అధికారంలోకి రావాలని తమ పార్టీకి లేదని.. అందుకే దశాబ్ధాల పాటు నలిగిపోయామని పేర్కొన్నారు. పక్కా స్ట్రక్చర్ కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. తాను సిద్ధాంతం కోసం ముందుకు సాగుతున్నాని చెప్పారు. తనకు పదవి కావాలంటే 2014లోనే నేను పోటీ చేసేవాడినని పేర్కొన్నారు. తనకు అప్పుడే మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చిందని చెప్పారు. పార్టీని సైద్ధాంతికంగా నిలబెట్టాలనే లక్ష్యంతో తాను ముందుకు సాగుతున్నానన్నారు.
Read Also: త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు : మంత్రి లోకేష్
Follow Us On: Sharechat

