epaper
Wednesday, February 18, 2026
epaper

అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్.. వైసీపీ నిర్ణయం ఏంటి..?

కలం, డెస్క్ : వైసీపీకి మరో షాక్ ఇచ్చారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి (AP Assembly) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇప్పటికే డిజిటల్ అటెండెన్స్ ఉంటుందని అయ్యన్న పాత్రుడు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరోసారి మీడియాతో మాట్లాడిన అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu).. రేపటి నుంచి అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్ అమలు చేస్తామని తెలిపారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదవుతుందన్నారు. ఇంతకు ముందు రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్లిపోయినా అటెండెన్స్ పడేదని.. ఇక నుంచి అలా చేయడం కుదరదని తెలిపారు.

పెద్ద కంపెనీల్లో కూడా ఏఐ బేస్డ్ అటెండెన్స్ వాడుతున్నారని.. పార్లమెంట్ లో కూడా దీన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివరించారు. ఇక నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు అమరావతిలోని పరేడ్ గ్రౌండ్స్ లోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 2028 నాటికి అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు కొత్త బిల్డింగ్ లోనే జరిగేలా చూస్తామని.. నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నందున 300 మందికి సీటింగ్ ఉండేలా నిర్మాణం చేపట్టినట్టు అయ్యన్న పాత్రుడు వెల్లడించారు.

వైసీపీకి బిగ్ షాక్..

స్పీకర్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యేలకు షాకింగ్ అనే అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఇన్ని రోజులు జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు రిజిస్టర్ లో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారు. సభలో పది నిముషాల కంటే ఎక్కువ సేపు కూర్చోవట్లేదు. ఈ రోజు కూడా పది నిముషాల్లోనే వెళ్లిపోయారు. కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలను సభ ముగిసే వరకు వారి సీట్లలో కూర్చోబెట్టాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కామెంట్లు చేస్తున్నారు. మరి రేపటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి (AP Assembly) వస్తారా రారా అనేది చూడాలి.

Read Also: అసెంబ్లీ ఎదుట జ‌గ‌న్ నిర‌స‌న‌

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>