కలం, వెబ్ డెస్క్: ఇండియా – పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ వివాదంపై పీసీబీ (PCB) మాజీ ఛైర్మన్ నజామ్ సెథీ (Najam Sethi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీబీ తీసుకున్న కఠిన వైఖరితో ఐసీసీ వెనక్కి తగ్గిందని తెలిపారు. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్థాన్ మొదట ఇండియాతో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లినట్లు సెథీ వివరించారు. ఐసీసీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులతో సమావేశం జరిగింది. ఆ చర్చల ముందు పీసీబీ దేశీయ, అంతర్జాతీయ న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నట్లు చెప్పారు. బహిష్కరణకు సంబంధించి శిక్షలు విధించే అవకాశాలు లేవని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.
గరిష్టంగా ఒక పాయింట్ కోల్పోయే పరిస్థితి మాత్రమే ఉంటుందని బోర్డు భావించినట్లు నజామ్ సెథీ (Najam Sethi) తెలిపారు. ఈ బలమైన స్థితిని ఐసీసీ కూడా గుర్తించిందని చెప్పారు. అందుకే ఐసీసీ చర్చలకు ముందుకొచ్చిందని అభిప్రాయపడ్డారు. డిప్యూటీ చీఫ్ ఇమ్రాన్ ఖ్వాజా, బంగ్లాదేశ్ ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ సంప్రదింపుల తర్వాతే పాకిస్థాన్ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు. మొత్తం మీద ఈ వివాదం చర్చలతో ముగిసింది. టోర్నీలో అత్యంత ఆసక్తికర పోరు మైదానంలోనే నిర్ణయించనున్నారు.
Read Also: పాక్‌తో మ్యాచ్ భారత్‌కు పరీక్షే: ర్యాన్ టెన్
Follow Us On : WhatsApp


