epaper
Wednesday, February 18, 2026
epaper

అసెంబ్లీ ఎదుట జ‌గ‌న్ నిర‌స‌న‌

క‌లం, వెబ్ డెస్క్‌: వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) ఏపీ అసెంబ్లీ(AP Assembly) ఎదుట నిర‌స‌న‌కు దిగారు. వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఈ రోజు ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ స‌హా వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. స‌భ ప్రారంభ‌మైన కొద్ది సేప‌టికే వైసీపీ స‌భ్యులు స‌భ‌లో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అడ్డుకుంటూ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. అనంత‌రం కొద్ది సేప‌టికే స‌భ నుంచి వైసీపీ స‌భ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ ఎదుట సైతం జ‌గ‌న్ స‌హా వైసీపీ స‌భ్యులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ప్ల‌కార్డులు ప‌ట్టుకొని నినాదాలు చేశారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా గుర్తింపునివ్వ‌ర‌ని, కుప్ప‌కూలిన శాంతి భ‌ద్ర‌త‌ల‌పై ప్ర‌శ్నించ‌నివ్వ‌ర‌ని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>