అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట.. బాండ్ల ధ్రువీకరణకు గ్రీన్‌సిగ్నల్‌

కలం, వనపర్తి: అగ్రిగోల్డ్‌ సంస్థలో డిపాజిట్లు చేసి సొమ్ము కోల్పోయిన బాధితులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అగ్రిగోల్డ్‌(AgriGold) బాండ్లు, నగదు రసీదుల ధ్రువీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర సీఐడీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు జిల్లాల బాధితుల కోసం మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయానికి ఎదురుగా ఉన్న సీఐడీ భవనంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల బాధితుల బాండ్లను మండలాల వారీగా పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియ నవంబర్ 25 నుంచి 2027 జూలై 30 వరకు 193 రోజుల పాటు కొనసాగుతుంది. రోజుకు గరిష్ఠంగా 250 మంది బాధితులకు ధ్రువీకరణ చేయనున్నారు. బాధితులు తమ మండలానికి కేటాయించిన తేదీల్లోనే కేంద్రానికి రావాలని ఎస్పీ డి.సునిత రెడ్డి సూచించారు.

డిపాజిటర్లు అసలు బాండ్ లేదా నగదు రసీదు, ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్, ఫొటో తీసుకురావాలని, డిపాజిటర్ మరణిస్తే నామినీ లేదా వారసులు మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు అవసరమైన పత్రాలు సమర్పించాలరి తెలిపారు. అసలు బాండ్‌ను అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. కేంద్రం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని, మరిన్ని వివరాలకు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రవిబాబు (8712659306)ను సంప్రదించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>