ప్రయాణిస్తుండగానే బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!

కలం, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా చిల్లకూరు (Chillakur) మండలం వరగలి క్రాస్ రోడ్డు వద్ద ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం (Bus Fire) సంభవించింది. వైజాక్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న మణికంఠ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సు ప్రయాణిస్తుండగానే మంటలు చెలరేగడంతో ఫైర్ అలారం మోగింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, ప్రయాణికులను బస్సులో నుంచి కిందకు దింపాడు. డ్రైవర్ అప్రమత్తతతో బస్సులోని 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు అంతటా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>