Mobile Popup Ad
Mobile Popup Ad

ఆప్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ భూ ప్రకంపనలు..!

కలం, వెబ్ డెస్క్ : ఆప్ఘనిస్తాన్‌లో సంభవించిన భారీ భూకంపం (Afghanistan Earthquake) భారత్‌లోని పలు ప్రాంతాలను తీవ్ర భయాందోళకు గురి చేసింది. శనివారం ఆప్ఘనిస్తాన్‌లోని ‘కలాఫ్గన్’ పట్టణానికి దాదాపు 81 కిలో మీటర్ల దూరంలో సంభవించిన ఈ భూకంపం వల్ల జమ్మూ కాశ్మీర్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి.

ఈ భూకంపం వల్ల ముఖ్యంగా శ్రీనగర్, పూంచ్, జమ్మూ పరిసర ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు లోనయ్యారు. ఆప్ఘనిస్తాన్‌ (Afghanistan) భూగర్భంలో దాదాపు 215 కిలో మీటర్ల లోతులు సంభవించిన ఈ భూకంప తీవ్రత 5.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంపం కేంద్రం భూమికి చాలా లోతులో ఉండడం వల్లే దీని ప్రభావం భారత్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు చైనా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, తుర్క్మెనిస్తాన్ దేశాలకు పాకిందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ భారీ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం అందుతోంది.

Read Also: పిల్లలు నిద్రపోయే ముందు తల్లిదండ్రులు చేయకూడని పొరపాట్లు ఇవే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>