కలం, స్పోర్ట్స్ డెస్క్ : ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ (AFCON) ఫైనల్స్‌లోకి మొరాకో (Morocco) ఎంట్రీ ఇచ్చింది. నైజీరియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో మొరాకో గోల్‌కీపర్ యాసిన్ బౌనూ హీరోగా నిలిచాడు. అదనపు సమయం వరకూ గోల్స్ లేకుండా ముగిసిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో నైజీరియాను 4–2తో ఓడించింది మొరాకో. షూటౌట్‌లో సామ్యూయెల్ చుక్వుయిజే, బ్రూనో ఒన్యెమాచి, పెనాల్టీలను బౌనూ అద్భుతంగా అడ్డుకోగా యూసఫ్ ఎన్ నెసిరి చేసిన గోల్ మొరాకోకు విజయాన్ని అందించింది.
ఇప్పుడు మొరాకో ఆదివారం జరిగే ఫైనల్‌లో సెనెగల్‌ను ఎదుర్కొనుంది. మరో సెమీ ఫైనల్‌లో సెనెగల్ సాడియో మానే గోల్‌తో ఈజిప్ట్‌ను 1–0తో ఓడించింది. స్వదేశంలో అర్ధశతాబ్దం తర్వాత తొలి ఏఎఫ్‌కాన్ (AFCON) టైటిల్ సాధించాలన్న ఆశతో మొరాకో ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. మరోవైపు నైజీరియా పెనాల్టీల్లో ఓడిపోవడంతో మూడో స్థానం కోసం పోటీ పడాల్సిన పరిస్థితి ఎదురైంది.
Read Also: నిర్మల్ టు యూఎస్.. వయా మేడారం.. రేపటి నుంచి సీఎం బిజీ బిజీ
Follow Us On: Pinterest


