3200 కిలోల కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ సీజ్

కలం, వెబ్ డెస్క్ : రోజురోజుకూ కల్తీ ఆహార పదార్థాలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మార్కెట్ లో బ్రాండ్ ల పేరుతో దొరికేది ఏది మంచిదో ఏది కల్తీదో కూడా అర్థం కాని పరిస్థితి. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో ఒక్కో చోట వేల కిలోల కల్తీ ఫుడ్స్ బయటపడం సంచలనం రేపుతోంది. మొన్ననే ఖైరతాబాద్ లో 3 క్వింటాళ్ల ఫేక్ పనీర్ తయారు చేస్తున్న వారిని పట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా 3200 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను (Adulterated Ginger Paste) పోలీసులు పట్టుకున్నారు.

పటాన్ చెరు నియోజకవర్గం శేరిలింగంపల్లిలో ఉన్న మాతేశ్వరి ఎంటర్ ప్రైజెస్ పై ఎస్ వోటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇక్కడ 3200 కిలోల నకిలీ అల్లం-వెల్లుల్లిపేస్ట్ ను (Adulterated Ginger Paste) సీజ్ చేశారు. భయంకరమైన కెమికల్స్, సిట్రిక్ యాసిడ్, ఉప్పు కలిపేసి అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>