యంగ్ హీరోపై అడివి శేష్ విమర్శలు.. పేరు చెప్పకుండానే కామెంట్స్!

క‌లం, వెబ్ డెస్క్‌: టాలీవుడ్‌లో హీరోల మ‌ధ్య పోటీ పెరిగిపోతోంది. ఒకప్పుడు ప్రాంతీయంగా ప‌రిమిత‌మైన తెలుగు సినిమాలు ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఫేమ‌స్ అయిపోతున్నాయి. అందుకే పాన్ ఇండియా స్టార్‌, గ్లోబ‌ల్ స్టార్ అంటూ తెలుగు న‌టుల‌కు కొత్త ట్యాగ్‌లు పుట్టుకొచ్చాయి. ఆడియెన్స్ కూడా చిన్న హీరోనా, కొత్త డైరెక్ట‌రా అని చూడ‌టం లేదు.. కంటెంట్ బాగుంటే అంద‌లం ఎక్కిస్తున్నారు. ఇదే కోవ‌లో హిట్ కొట్టిన ఓ యంగ్ హీరోపై యాక్ట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ అడివి శేష్ (Adivi Sesh) తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

అడివి శేష్ న‌టించిన డెకాయిట్ మూవీ మ‌రికొద్ది రోజుల్లో విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా మూవీ టీం ప్ర‌మోష‌న్ల‌తో బిజీగా ఉంది. ఈ సంద‌ర్భంగా అడివి శేష్ పాల్గొన్న ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న మూవీ ప్రొడ్యూస‌ర్ బ‌ర్త్ డేకు హాజ‌రైన‌ప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌న‌ను ప్రేక్ష‌కుల‌తో పంచుకున్నాడు. అప్పుడ‌ప్పుడే హిట్ కొట్టిన ఓ యంగ్ హీరో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చాడ‌ని, శేష్ నువ్వెప్పుడు నాలాగా పెద్ద సినిమా చేస్తున్నావ్ అని ప్ర‌శ్నించాడ‌ని చెప్పారు. త‌న పేరు చెప్ప‌ను అని శేష్ అన్నాడు. ఆ హీరో అడిగిన ప్ర‌శ్న‌కు శేష్ త‌న మ‌న‌సులో ఇంత కుళ్లు బుద్ధి ఏంట‌ని అనుకున్న‌ట్లు చెప్పారు. అయితే శేష్‌ ఆ హీరో పేరు మాత్రం చెప్ప‌లేదు. నెటిజ‌న్లు మాత్రం ఆ హీరో నిఖిల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు విజ‌య్ దేవ‌ర‌కొండ లేదా విశ్వ‌క్ సేన్ కూడా అయ్యి ఉండొచ్చ‌ని చెప్తున్నారు. ఏదేమైనా ఈ పాన్ ఇండియా హిట్ల గోల‌తో హీరోల మధ్య ఇలాంటి కాంపిటేష‌న్ మొద‌లైంద‌న్న విష‌యాన్ని శేష్ (Adivi Sesh) బ‌య‌ట‌పెట్టేశాడు.

Read Also: ఇంటెన్స్ లుక్ లో రష్మిక.. ‘మైసా’ పోస్టర్ రిలీజ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>