ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఘర్షణ

కలం, వెబ్ డెస్క్ : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫెడరేషన్ (Film Federation) నిధుల దుర్వినియోగం, అలాగే ఎన్నికల నిర్వహణపై వివాదాలు చెలరేగడంతో సభ్యులు, కార్యవర్గ సభ్యుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, ఫెడరేషన్‌కు చెందిన నిధుల వినియోగంపై కొంతకాలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అచ్చంపేటలో భూమి కొనుగోలు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత పెరిగింది.

ఈ క్రమంలో సమావేశం నిర్వహించే సమయంలో వాగ్వాదం తీవ్రరూపం దాల్చి, తోపులాటకు దారితీసింది. సభ్యులు, కార్యవర్గ సభ్యుల మధ్య వాగ్వాదం పెరిగి కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు అందడంతో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనతో ఫెడరేషన్‌లో (Film Federation) అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగగా, కార్యాలయం వద్ద భద్రతను పెంచారు.

Read Also: ఇంటెన్స్ లుక్ లో రష్మిక.. ‘మైసా’ పోస్టర్ రిలీజ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>