Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంటెన్స్ లుక్ లో రష్మిక.. ‘మైసా’ పోస్టర్ రిలీజ్

కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘మైసా’ (Mysaa) నుంచి స్పెషల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రష్మిక మందన్న (Rashmika Mandanna) పుట్టిన రోజు సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నేషనల్ క్రష్ రష్మిక గాయాలతో, యుద్ధం చేసినట్లుగా కనిపిస్తోంది. ఆమె ఫేస్ పైన మట్టి, పొగ, రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ముక్కు, చెంపలు, నుదుటిపై ఉన్న గాయాలు ఆమె పాత్ర ఎదుర్కొన్న క్రూరత్వాన్ని చూపిస్తున్నాయి. అయినా ఆమె కళ్లలో కనిపించే ఆగ్రహం, తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. పాత్రకు తగ్గట్లుగా ఇంటెన్స్ లుక్ లో ఉన్న పోస్టర్ ఫ్యాన్స్ ను తీవ్రంగా ఆకట్టుకుంటోంది.

డైరెక్టర్ రవీంద్రపూలే దర్శకత్వంలో వస్తున్న మైసా (Mysaa) సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. గొండ్ తెగల సాంస్కృతిక నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో రష్మిక ఒక శక్తివంతమైన మహిళగా కనిపించనున్నారు. ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ కీలక పాత్రలో నటిస్తుండగా సినిమాటో గ్రఫిని శ్రేయాస్ పి కృష్ణ అందిస్తున్నారు. సంగీతాన్ని జేక్స్ బీజోయ్ సమకూరుస్తుండగా అండీ లాంగ్ స్టంట్స్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నారు.

Read Also: బాసరకు కొత్త శోభ.. సర్కారు మాస్టర్ ప్లాన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>