ఎస్ఆర్‌హెచ్‌ను బతికించిన క్లాసెన్, నితీష్.. లక్నో లక్ష్యం 157

కలం, స్పోర్ట్స్ : ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌ (SRH vs LSG) లో ఎస్ఆర్‌ఎస్ ప్రారంభం నుంచి కష్టాల్లో పడింది. 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే 24 పరుగులకే నాలుగో వికెట్ కూడా పడటంతో ఎస్‌ఆర్‌హెచ్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కనీసం 50 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం అభిమానుల్లో కూడా కలిగింది. ఆ సమయంలో క్లాసెన్, నితీష్ కుమార్ నిల్చుని జట్టును గట్టెకించారు. ఇద్దరూ అర్థశతకాలతో మెరిశారు. వారి వికెట్లు పడిన తర్వాత ఎస్‌ఆర్ హెచ్ మరోసారి కుప్పకూలడం స్టార్ట్ చేసింది. ఎట్టకేలకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. లక్నో ముందు ఇప్పుడు 157 పరుగుల లక్ష్యం ఉంది.

మహమ్మద్ షమీ (Shami) స్వింగ్ ధాటికి సన్‌రైజర్స్ టాపార్డర్ పేకమేడలా కూలిపోయింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. క్లాసెన్ 41 బంతుల్లో 62 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిస్తే, నితీష్ రెడ్డి కేవలం 33 బంతుల్లోనే 5 భారీ సిక్సర్లతో 56 పరుగులు పిండుకుని స్టేడియాన్ని హోరెత్తించాడు. వీరిద్దరి అసాధారణ పోరాటమే సన్‌రైజర్స్‌కు కొండంత అండగా నిలిచింది.

ఒక దశలో 100 పరుగులు దాటడమే గగనమనుకున్న స్థితి నుంచి, క్లాసెన్-నితీష్ జోడీ జట్టును గౌరవప్రదమైన 156 పరుగుల స్కోరు వద్ద నిలబెట్టింది. మ్యాచ్ (SRH vs LSG) చివర్లో అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ వరుస వికెట్లతో ఒత్తిడి పెంచినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లక్నో ముందు ఇప్పుడు 157 పరుగుల సవాల్ ఉంది. పిచ్ స్వభావాన్ని బట్టి చూస్తే ఇది తక్కువ స్కోరేమీ కాదు. మరి ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో లక్నో వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.

Read Also: యంగ్ హీరోపై అడివి శేష్ విమర్శలు.. పేరు చెప్పకుండానే కామెంట్స్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>