కలం, సినిమా డెస్క్: విభిన్న కథా చిత్రాలతో బ్లాక్‌బస్టర్స్ సాధిస్తున్న అడివి శేష్(Adivi Sesh) నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. ఈ సినిమాతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ లవ్, యాక్షన్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. శేష్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్… ఈరోజు (గురువారం) అద్భుతమైన టీజర్(Dacoit Teaser)ను విడుదల చేశారు.
టీజర్ విషయానికి వస్తే.. టీజర్ లవ్ స్టొరీ, ఒక పెద్ద లక్ష్యంతో నడిచే హీరోని ప్రజెంట్ చేస్తోంది. ప్రేమ, దోపిడీ ఈ రెండు ప్రధాన అంశాల చుట్టూ కథనం అద్భుతంగా వుంది. మొదటిసారిగా మాస్-ఓరియెంటెడ్ పాత్రలో కనిపించిన అడివి శేష్ అదరగొట్టారు. క్యారెక్టర్ మల్టీ షేడ్స్‌తో ఆకట్టుకుంది. శేష్ రగ్గడ్ అవతార్‌లో కనిపించిన తీరు అదిరిపోయింది. మదనపల్లె యాసలో మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. మృణాల్ ఠాకూర్ పాత్ర శేష్ పాత్రలతో పాటు ప్రయాణిస్తుంది. అమాయకత్వం, ఎమోషన్ మధ్య ఊగిసలాడుతూ కథనానికి డెప్త్ ని జోడిస్తుంది. టీజర్ అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్‌లను కీలక పాత్రలలో పరిచయం చేస్తుంది. అనుభవజ్ఞులైన నటుల అద్భుతమైన తారాగణం శక్తివంతమైన ఆన్-స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధంగా వుంది.
ఈ టీజర్(Dacoit Teaser) లో నాగార్జున కెరీర్ లో మరచిపోలేని హలో బ్రదర్ సినిమాలోని ఐకానిక్ సాంగ్ ‘కన్నె పిట్టరో కన్ను కొట్టరో’ రీమిక్స్ చేయడం ఎక్స్ పీరియన్స్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళుతుంది. సాంకేతికంగా టీజర్ అత్యున్నతంగా వుంది. సినిమాటోగ్రాఫర్ దనుష్ భాస్కర్ విజువల్స్ అద్భుతంగా వున్నాయి. యాక్షన్ సన్నివేశాలు చాలా గ్రాండ్ గా ప్రజెంట్ చేశారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉనాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ అద్భుతమైన టీజర్ సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరి.. టీజర్ మెప్పించినట్టుగా సినిమా కూడా మెప్పించి సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.
Read Also: విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ గ్లింప్స్ 22న
Follow Us On: X(Twitter)


