మిషన్‌మోడ్‌లో ధాన్యం సేకరణ: జె.ఎల్.బి హరిప్రియ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో బాయిల్డ్ రైస్ మిల్లర్లు వారికి కేటాయించిన దొడ్డు రకం ధాన్యం సేకరణకు సహకరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియ కోరారు. శనివారం జిల్లా (Mahabubnagar) కలెక్టర్ కార్యాలయంలోని ఎన్. ఐ.సి.కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలోని బాయిల్డ్ రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ డి.టి.లు, లారీ కాంట్రాక్టర్లతో ధాన్యం సేకరణపై సమావేశం నిర్వహించి సమీక్షించారు. ప్రస్తుతం ధాన్యం సేకరణ పీక్ లో ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి మిషన్ మోడ్ లో ధాన్యం సేకరణ చేయాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అందుకనుగుణంగా మే నెలాఖరు లోగా ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని ఆదేశించామని తెలిపారు. జిల్లాలో 75 రైస్ మిల్లర్లు ధాన్యం సేకరణలో పాల్గొంటున్నారని,ఇందులో 60 రా రైస్ మిల్లర్లు,15 బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఉన్నారని తెలిపారు.

ముఖ్యంగా దొడ్డు రకం ధాన్యం సేకరణ బాయిల్డ్ మిల్లర్లు మిల్లింగ్ సామర్థ్యం మేరకు కేటాయించిన ధాన్యం జాప్యం లేకుండా దిగుమతి చేసుకోవాలని సూచించారు. మిల్లు వద్ద హమాలీలు సంఖ్య పెంచుకోవాలని ఆన్ లోడింగ్ త్వరగా వీలు అవుతుందని తెలిపారు. లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చిన కొనుగోలు కేంద్రాలకు లారీలు ఏర్పాటు చేయాలని అన్నారు. ధాన్యం సేకరణ వేగవంతం చేయుటకు, రవాణా సమస్య లేకుండా ట్రాన్స్పోర్ట్, పోలీస్ శాఖ సహకారంతో రోడ్డుపై లారీలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ధాన్యం సేకరణ కొనుగోలు కేంద్రాల్లో ట్రాన్స్పోర్ట్ శాఖ ఏర్పాటు చేసిన లారీలు ప్రత్యేక వరసలో ఏర్పాటు చేసి ధాన్యం ఆన్ లోడింగ్ చేసుకోవాలని సూచించారు. పౌర సరఫరాల డి.టి.లు మిల్లులలో ఆన్ లోడింగ్ మానిటర్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డి.సి.ఆర్.బి.డి.ఎస్.పి రమణా రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్,జిల్లా పౌర సరఫరాల సంస్థ డి.ఏం.రవి నాయక్, మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>