కలం, వెబ్ డెస్క్ : హీరోయిన్ల బట్టల గురించి నటుడు శివాజీ చేసిన కామెంట్లతో మొదలైన రచ్చ ఇంకా కంటిన్యూ అవుతోంది. చాలా మంది దీనిపై మాట్లాడుతున్నారు. తాజాగా నటి రోహిణి (Actress Rohini) కూడా ఈ విషయంపై స్పందించింది. మన పిల్లలకు మంచి, చెడుల గురించి మనమే వివరించాలి. మన పిల్లల్లో తేడా గమనిస్తే వాళ్లను కూర్చోబెట్టి అన్నీ వివరించాలి. మనం ఎలాంటి బట్టలేసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయాలను కూడా వారికి తెలియజేయాలి. మన ఇండియాలో చీరలు కట్టుకుంటాం. లండన్ లో షార్ట్స్ వేసుకుంటారు. మనం నిండుగా బట్టేసుకోవాలి. నగ్నంగా బయటకు వెళ్లొద్దు అనే కామన్ విషయాలను మన పిల్లలకు నేర్పించాలి’ అంటూ చెప్పుకొచ్చింది నటి రోహిణి.
మన పిల్లలకు మంచి, చెడులు వివరిస్తే వాళ్లు మనలాగే మంచి మార్గంలో నడుస్తారు అని తెలిపింది రోహి. అంతేగానీ చెడు అలవాట్లకు బానిస అయినా ఊరకుంటే వాళ్లు మన చేతుల్లో ఉండరని చెప్పింది. ‘ఆడపిల్లలకు కొన్ని రూల్స్ ఉంటున్నాయి. ఎందుకంటే అత్తారింట్లో మా పరువు నిలబెట్టాలి అని పేరెంట్స్ అలా చెబుతారు. కానీ అబ్బాయి, అమ్మాయి సమానం అని చిన్నప్పటి నుంచే చెబుతూ.. అన్ని పనులు ఇద్దరూ కలిసి చేయాలని చెబితే కొంచెం మార్పు వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది నటి రోహిణి (Actress Rohini).
Read Also: ఆ ఛాన్స్ మిస్ అవ్వడంతో చాలా బాధపడ్డా.. ప్రభాస్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
Follow Us On : WhatsApp


