యాంటీ నేషనలిస్ట్, పెయిడ్ ఆర్టిస్ట్: నవదీప్ హాట్ కామెంట్స్!

కలం, వెబ్ డెస్క్ : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం, దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలపై టాలీవుడ్ నటుడు నవదీప్ (Actor Navdeep) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ సమాజంలో భిన్నాభిప్రాయాల పట్ల వ్యక్తమవుతున్న ధోరణులను తప్పుపట్టారు. ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపితే యాంటీ-నేషనలిస్ట్ అని, అదే విద్యార్థుల పక్షాన నిలబడితే పెయిడ్ ఆర్టిస్టులని ముద్ర వేస్తున్నారని ఆయన అన్నారు.

ఏదైనా విషయంపై సొంత అభిప్రాయాన్ని చెబితే నీకేం తెలుసని ప్రశ్నిస్తారని, అసలు మాట్లాడకపోతే ఏమీ చేయలేదని విమర్శిస్తారని నవదీప్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, డెమాక్రసీ అంటే ఏమిటని ఆయన ప్రశ్నించారు. నవదీప్ సంధించిన ఈ ప్రశ్నలు ప్రస్తుతం నెటిజన్ల మధ్య చర్చకు దారితీశాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>