కాంగ్రెస్ సర్కార్‌ది చేతకాని పాలన: పొన్నం అనిల్ ​

కలం, కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేతగాక అక్రమ అరెస్టులకు తెరలేపిందని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్‌ గౌడ్ (Ponnam Anil Kumar Goud) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ శ్రేణుల గొంతు నొక్కేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసులను అడ్డుపెట్టుకుని రాక్షస క్రీడ నడుపుతోందని మండిపడ్డారు. తెల్లవారుజామున కనీస నిబంధనలు పాటించకుండా, పోలీసులను ఇళ్లపైకి పంపి తీవ్రవాదులను పట్టుకున్నట్లుగా నాయకులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఈ మేరకు కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

కుట్రపూరిత చర్యలను ఖండిస్తున్నాం..

కాంగ్రెస్ ప్రభుత్వ ఈ అప్రజాస్వామిక, కుట్రపూరిత చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని  అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ​కొత్తపల్లి మండలానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, మాజీ ఎంపీటీసీ కమల మనోహర్, బీఆర్ఎస్ యువ నాయకులు గంగాధర చందు, శ్రీకాంత్‌, శనిగరపు సతీష్, కమల్ గౌడ్ లతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను ఇళ్ల నుంచి బలవంతంగా అదుపులోకి తీసుకుని కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

అక్రమ కేసులు బనాయిస్తున్నారు..

​ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ, అర్ధరాత్రి పూట భయానక వాతావరణం సృష్టిస్తున్నారని అనిల్ కుమార్ విమర్శించారు. పోలీసులను అడ్డంపెట్టుకుని చేసే ఇటువంటి అణచివేత చర్యలు ఎన్నాళ్ళూ సాగవని అన్నారు. కాలం చెల్లిన కాంగ్రెస్ ట్రిక్కులను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులందరినీ బేషరతుగా విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాయని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>