Mobile Popup Ad
Mobile Popup Ad

మోహన్ బాబుకు హైకోర్టు షాక్​

కలం, వెబ్​ డెస్క్​ : కిడ్నాప్ కేసులో నటుడు మోహన్ బాబు (Mohan Babu)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో మోహన్ బాబు (Mohan Babu) పాత్రకు సంబంధించి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. దీంతో ఈ వ్యవహారంలో బాధితుడి వాదనలను కూడా వినాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం తెలిపింది. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం తదుపరి నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేస్తూ, కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>