Mobile Popup Ad
Mobile Popup Ad

మల్లారెడ్డి అక్రమాస్తుల కేసు.. బ్యాంకు లాకర్‌లో కిలో బంగారం స్వాధీనం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి (Mallareddy) బ్యాంకు లాకర్‌లో కిలో బంగారం బయట పడింది. నిజామాబాద్ హైదరాబాద్ లలో మల్లారెడ్డి ఇల్లు కార్యాలయంలో గతనెల 23వ తేదీన ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆయన ఇంట్లో రూ.3 లక్షల నగదు, బ్యాంకు ఖాతాలో రూ. 50 లక్షల నగదు గుర్తించి సీజ్ చేశారు.

అదేరోజు హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఉన్న ఇంటికి మల్లారెడ్డిని తీసుకెళ్లి అక్కడ కూడా విచారణ చేపట్టారు. తాజాగా హైదరాబాద్‌లోని బ్యాంకుల్లో మూడు లాకర్లు ఉన్నాయని గుర్తించి వాటిని తెరిచి చూశారు. రూ. 1.43 కోట్ల విలువైన కిలో బంగారం, రూ. 2.5 లక్షల విలువైన వెండి (కిలో) లభ్యం అయ్యాయి. మల్లారెడ్డి నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఆరేళ్ల నుంచి పని చేశారు.

ఈ సమయంలో ఆయన సాగించిన వసూళ్లపై డైరీ రాశారని, ఆ వివరాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. కల్లు దుకాణాలు, వైన్స్ షాపుల నుంచి తీసుకుంటున్న పాత కొత్త లంచాల వివరాలు అందులో కనిపించడం జనాల్లో అధికారుల్లో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>