మెదక్​ ప్రభుత్వాస్పత్రిలో ఏసీబీ తనిఖీలు

క‌లం, మెద‌క్ బ్యూరో : మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపులో అలసత్వం, అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు శుక్రవారం తనిఖీలు (ACB Raids) నిర్వహించారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ సెక్షన్ సూపరింటెండెంట్ లతీఫ్ ముజాహిద్దీన్‌పై ఈ తనిఖీలు జరిగాయి. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీ (ACB Raids)లో బిల్లులకు సంబంధించిన ఫైల్స్ నిబంధనల మేరకు ప్రాసెస్ కావడం లేదని తేలింది. బిల్లుల ఇన్‌వార్డ్ నమోదు మాత్రమే జరిగి ఉండగా, ఔట్‌వార్డ్ వివరాలు నమోదు చేయలేదని ఏసీబీ అధికారులు గుర్తించారు.

గత సెప్టెంబర్ నుంచి ఈ సూపరింటెండెంట్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన వద్దకు 282 బిల్లులు వచ్చినప్పటికీ, కేవలం 116 బిల్లులు మాత్రమే ముందుకు పంపాల్సి ఉండగా, మిగిలినవి పంపలేదని తనిఖీల్లో తేలింది. బిల్లుల మంజూరులో తీవ్ర అలసత్వం ఉందనే ఫిర్యాదుల ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. బిల్లులు సక్రమంగా ఫార్వర్డ్ చేయకపోవడం, ఫైల్స్ కదలికలో నిబంధనలు పాటించకపోవడం, ఇన్‌వార్డ్ నమోదు తర్వాత ఔట్‌వార్డ్ ఎంట్రీలు లేకపోవడం వంటి అంశాలు తనిఖీల్లో బయటపడ్డాయి. బిల్లులను నేరుగా ఇచ్చినట్లు లేదా సరైన ప్రక్రియ లేకుండా నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీతను కూడా ఏసీబీ అధికారులు విచారించారు. తనిఖీల్లో బయటపడిన వాస్తవాలను, అన్ని వివరాలను పూర్తి నివేదిక రూపంలో సంబంధిత మెడికల్ హెడ్ ఆఫీస్‌కు అందజేస్తామని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ స్పష్టం చేశారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల సక్రమ ప్రక్రియ లేకపోవడం వల్ల ఆసుపత్రి సిబ్బంది, బాధితులు ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ చర్య చేపట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>