మార్చి చివరి నాటికి లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి : మంత్రి పొంగులేటి

కలం/ఖమ్మం బ్యూరో : మార్చి చివరి నాటికి రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తున్నామని మంత్రి పొంగులేటి (Ponguleti) శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండలంలోని జాస్తిపల్లి, లాల్యతండ, ఊటుకూరు గ్రామాల్లో రూ.12.48 కోట్లతో, బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. దీంతో పాటు ముచ్చర్ల, పింజరమడుగు గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి (Ponguleti) శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తామని మోసం చేశారని మంత్రి మండిపడ్డారు. ముచ్చర్ల, పింజరమడుగు గ్రామాల్లో గత ప్రభుత్వం అసంపూర్తిగా ఉంచిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. బీఆర్ ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇండ్లు కూడా నిర్మించలేదని, తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. మార్చి చివరి నాటికి రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. రాబోయే ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. ఊటుకూరులో చేపట్టిన అభివృద్ధి పనులను వర్షాకాలం నాటికి కంప్లీట్ చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>