విశాఖ‌లో ఏసీబీ అధికారుల దాడులు

క‌లం, వెబ్ డెస్క్‌: విశాఖ‌ప‌ట్నంలో ఏసీబీ(ACB) అధికారులు గురువారం తెల్ల‌వారుజాము నుంచే త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో రిటైర్డ్ సూప‌రింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్ రావు ఇంట్లో సోదాలు చేస్తున్నారు. శ్రీనివాస రావు గ‌తంలో పంచాయ‌తీ రాజ్ శాఖ‌లో ప‌ని చేసి రిటైర్ అయ్యారు. ఆయ‌న‌పై ప‌లు అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో శ్రీనివాస‌రావుకు సంబంధించిన ఇళ్ల‌ల్లో ఏక కాలంలో మూడు చోట్ల ఏసీబీ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. విశాఖ‌లోని మ‌ధుర‌వాడ, మ‌న్యం జిల్లాలోని సాలూరులో అధికారులు త‌నిఖీలు చేస్తున్నారు. హైద‌రాబాద్‌లోని శేరిలింగంప‌ల్లిలో కూడా ఏసీబీ సోదాలు జ‌రుగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>