epaper
Wednesday, February 18, 2026
epaper

చంద్రహాస్ పాట వివాదం.. కేసు నమోదు

కలం, సినిమా : బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ (Chandrahass) పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల చంద్రహాస్ నటించిన లేటెస్ట్ మూవీ “బరాబర్ ప్రేమిస్తా”(Barabar Premistha) ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్‌లో ‘గుంజి గుంజి’ అంటూ చంద్రహాస్ పాడిన పాట వివాదాస్పదం అయింది. ప్రమోషన్‌లో భాగంగానే  చంద్రహాస్ పరుష పదజాలంతో ఆ పాట పాడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ ఘటనపై అశోక్  అనే  ప్రముఖ టీవి ఎడిటర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పబ్లిక్ ఈవెంట్‌లో ఈ తరహా పాట పాడటం ద్వారా సామాజిక విలువలకు భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహారం ప్రస్తుతం సినీ వర్గాలలో, సోషల్ మీడియాలో  బాగా వైరల్ అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>