కలం, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఉత్సాహంగా పాల్గొన్నారు. అరకులోని అంబేద్కర్ కళావేదిక వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన గిరిజనులతో నేరుగా మమేకమయ్యారు. గిరిజన సంప్రదాయాన్ని గౌరవిస్తూ కొమ్ము తలపాగా ధరించి, చేతిలో డప్పు పట్టుకుని మోగిస్తూ అందరినీ ఉత్సాహపరిచారు.
స్థానిక కళాకారులతో కలిసి సీఎం చంద్రబాబు సంప్రదాయ థింసా నృత్యం చేస్తూ ఉత్సాహంగా అడుగులు వేశారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను ప్రదర్శిస్తూ సాగిన ఈ కార్యక్రమం అరకు ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

