మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ మళ్లీ అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్‌గా వంశీ మోహన్‌ను (Vamsi Mohan) మరోసారి ఏసీబీ (ACB) అరెస్ట్ చేసింది. ఆయన బినామీల ఇళ్లల్లో ఉదయం నుంచి సోదాలు జరుపుతున్న ఏసీబీ అధికారులు గచ్చిబౌలిలోని ఓ ప్లాట్‌లో రూ.58 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా రెండు ప్లాట్లను బలవంతంగా తన పేరిట రాయించుకున్నట్లు తేలింది. దీంతో అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.

మే 22న వంశీ మోహన్ నివాసాల్లో మొదటిసారి సోదాలు జరిపిన ఏసీబీ.. రూ.5.58 కోట్ల విలువైన 19 ఓపెన్ ప్లాట్లు, మూడు ఇళ్లను గుర్తించింది. అంతేగాకుండా, ఇబ్రహీంపట్నం సమీపంలోని నారపల్లి వద్ద రెండెకరాల ఫాంహౌస్ కూడా ఉన్నట్లు తెలిపింది.

ప్రభుత్వ భూములే టార్గెట్..

వంశీ మోహన్ (Vamsi Mohan) హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే ఎన్నో ఏళ్లు ఆర్డీవోగా పనిచేశారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి, అబ్దుల్లాపూర్ మెట్ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ భూములే టార్గెట్ చేసి కాజేసినట్లు ఏసీబీ గుర్తించింది. అంతేగాకుండా, పలువురు రియల్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనాలు కల్పించి.. భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలో ఓ రియల్టర్ నుంచి ఏకంగా పది ప్లాట్లు గిఫ్ట్ డీడ్ చేసుకోవడం చూసి ఏసీబీ అధికారులే షాకయ్యారు. ఆయనకు అనేక మంది బినామీలు ఉండొచ్చనే కోణంలో విచారణ జరుపుతున్న ఏసీబీకి ఇటీవలే కీలక ఆధారాలు లభించాయి. ఈ రోజు మరోసారి తనిఖీలు చేసి అరెస్ట్ చేశారు.

Read Also: 140 కోట్ల జనాభా ఉన్నా.. క్రీడల్లో వెనుకబడ్డాం : సీఎం రేవంత్

Read Also: డిజిటల్ వారసులు 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>