ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) కొత్త రికార్డ్ సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో అతి తక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అభిషేక్ ఈ ఫీట్ సాధించాడు. వెయ్యి పరుగుల మైలురాయిని అందుకోవడానికి అతడు తీసుకున్న బంతులు 528. దీంతో అతితక్కువ బంతుల్లో 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు. అంతేకాకుండా అతి తక్కువ మ్యాచ్‌లలో ఈ మైలురాయిని అధిగమించిన రెండో ఇండియా బ్యాటర్‌గా కూడా అభిషేక్ రికార్డ్ చేశాడు.
అతి తక్కువ బంతుల్లో అంతర్జాతీయ టీ20లలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్లు
అభిషేక్ శర్మ(Abhishek Sharma)- 528 బంతుల్లో
సూర్యకుమార్ యాదవ్- 573 బంతుల్లో
ఫిల్ సాల్ట్- 599 బంతుల్లో
గ్లెన్ మాక్స్‌వెల్- 604 బంతుల్లో
ఆండ్రీ రసెల్, ఫిన్ అలెన్- 609 బంతుల్లో.
తక్కువ ఇన్నింగ్స్‌లో అంతర్జాతీయ టీ20లలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న భారత బ్యాటర్లు
విరాట్ కోహ్లి- 27 ఇన్నింగ్స్‌లలో
అభిషేక్ శర్మ- 28 ఇన్నింగ్స్‌లలో
కేఎల్ రాహుల్- 29 ఇన్నింగ్స్‌లలో
సూర్యకుమార్ యాదవ్- 31 ఇన్నింగ్స్‌లలో
రోహిత్ శర్మ- 40 ఇన్నింగ్స్‌లలో.
Read Also: ఆసియా కప్ ట్రోఫీ కోసం రంగంలోకి ఐసీసీ..
Follow Us on : Pinterest

