నిర్మల్‌లో అండర్‌-14 రగ్బీ ఎంపిక పోటీలు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్‌-14 రగ్బీ (Under-14 Rugby) బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 100 మంది బాలికలు, 120 మంది బాలురు పోటీలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ రాథోడ్ లక్ష్మణ్ తెలిపారు. జోనల్ స్థాయి పోటీలను అక్టోబర్ చివరిలో నిర్మల్‌ లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు రమణారావు, టీజీపీఏ కార్యదర్శి వన్నెల భూమన్న, కోశాధికారి నచ్చేందర్, జాయింట్ సెక్రటరీ పోశెట్టి, సంజీవ్, హన్మండ్లు, ముఖేష్, ఆర్గనైజర్ భూమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రేమలత, గిరి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>