కలం, వెబ్ డెస్క్ : కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్యా రహానే (Ajinkya Rahane) జట్టులో కొనసాగడంపై మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ (Abhinav Mukund) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026 సీజన్ దగ్గర పడుతున్న సమయంలో రహానే కేవలం తన నాయకత్వ లక్షణాల వల్లే టాప్-4 బ్యాటింగ్ ఆర్డర్‌లో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రేయస్ అయ్యర్ వంటి బలమైన కెప్టెన్ జట్టును వీడిన తర్వాత కేకేఆర్‌కు సరైన ప్రత్యామ్నాయం దొరకలేదని ఆయన పేర్కొన్నారు.
గత 2025 సీజన్‌లో రహానే బ్యాటర్‌గా రాణించినా, జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యారు. 13 మ్యాచ్‌ల్లో 390 పరుగులు చేసినా, కెప్టెన్‌గా కేవలం 5 విజయాలనే అందించగలిగారు. దీంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. సాల్ట్, స్టార్క్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం వల్ల జట్టు తన మునుపటి జోరును ప్రదర్శించలేకపోయిందని ముకుంద్ (Abhinav Mukund) విశ్లేషించారు.
ఈ క్రమంలోనే కేకేఆర్ మేనేజ్‌మెంట్ 2026 వేలంలో భారీ మార్పులు చేసింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green) ను రూ.25.20 కోట్ల రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకుంది. దీనిపై ఫాఫ్ డు ప్లెసిస్ (Faf du Plessis) స్పందిస్తూ.. గ్రీన్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారని తెలిపారు. గ్రీన్ ఫినిషర్ కంటే కూడా ఆదిలోనే క్రీజులోకి వస్తేనే ఎక్కువ ప్రభావం చూపగలరని ఆయన వివరించారు.
Read Also: వేసవి వచ్చేసింది.. వార్డ్‌రోబ్‌లో ఈ మార్పులు చేసుకోండి
Follow Us On: Sharechat

