వేసవి వచ్చేసింది.. వార్డ్‌రోబ్‌లో ఈ మార్పులు చేసుకోండి

కలం, వెబ్ డెస్క్: భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండలు ముదురుతున్న వేళ కేవలం ఆహారపు అలవాట్లే కాదు.. మనం ధరించే దుస్తుల్లో (Summer Clothing) కూడా మార్పులు చేయడం అత్యవసరమని ఆరోగ్య , ఫ్యాషన్ నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవడం ద్వారా ఎండ తీవ్రతను తగ్గించుకోవడమే కాకుండా, శరీర ఉష్ణోగ్రతను కూడా అదుపులో ఉంచుకోవచ్చు.

బెస్ట్ ఫ్యాబ్రిక్స్

వేసవి కాలంలో చర్మంపై చెమట పేరుకుపోకుండా ఉండాలంటే గాలి ఆడే దుస్తులు ధరించడం (Summer Clothing)  మొదటి మెట్టు. కాటన్.. ఇది అద్భుతమైన పీల్చుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. చర్మంపై ఉన్న చెమటను త్వరగా పీల్చుకుని మనల్ని పొడిగా ఉంచుతుంది. లెనిన్.. ఇది చాలా తేలికైన , గాలి ఆడే ఫ్యాబ్రిక్. వేసవిలో శరీరానికి హాయినివ్వడంలో దీనికి సాటి లేదు. చాంబ్రే.. ఇది చూడటానికి డెనిమ్‌లా ఉన్నా, చాలా తేలికగా ఉండి వేసవికి సరిగ్గా సరిపోతుంది.

రంగులు, ఫిట్టింగ్

దుస్తుల రంగులు కూడా శరీర వేడిపై ప్రభావం చూపుతాయి. తెలుపు, బేజ్, క్రీమ్, లేత నీలం వంటి రంగులు సూర్యరశ్మిని ప్రతిబింబించి వేడిని తగ్గిస్తాయి. అదే నలుపు లేదా నేవీ బ్లూ వంటి ముదురు రంగులు వేడిని గ్రహిస్తాయి, కాబట్టి వాటిని నివారించాలి. అలాగే, బిగుతుగా ఉండే దుస్తుల కంటే గాలి ప్రసరణ బాగుండేలా లూజ్ ఫిట్టింగ్ ఉన్న మ్యాక్సీ డ్రెస్సులు, లినెన్ ట్రౌజర్లు, లూజ్ టాప్స్‌ను ఎంచుకోవాలని నిపుణులు పేర్కొన్నారు. పాలిస్టర్, సిల్క్ , ఇతర సింథటిక్ దుస్తులకు ఈ కాలంలో దూరంగా ఉండటం మంచిది. ఇవి గాలిని లోపలికి రానివ్వవు, దీనివల్ల శరీర వేడి, తేమ లోపలే ఉండిపోయి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

అదనపు జాగ్రత్తలు

కేవలం దుస్తులే కాకుండా, ఇతర యాక్సెసరీస్ కూడా రక్షణ ఇస్తాయి. ముఖం, మెడపై ఎండ పడకుండా వెడల్పాటి అంచులు ఉన్న టోపీలు, సన్ గ్లాసెస్ ధరించాలి. పాదాలు వేడెక్కకుండా ఉండాలంటే గాలి ఆడే కాన్వాస్ షూస్ లేదా లెదర్ శాండల్స్ ఎంచుకోవాలి. నేరుగా ఎండ తగలకుండా ట్యాంక్ టాప్స్ మీద కాటన్ షర్ట్స్‌ను ధరించడం ద్వారా చర్మాన్ని కాపాడుకోవచ్చు. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన దుస్తులను మార్చుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సౌకర్యంతో పాటు స్టైల్‌ను అందించే ఈ చిన్నపాటి చిట్కాలు వేసవి తాపాన్ని తట్టుకోవడంలో ఎంతో దోహదపడతాయి.

Read Also: బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావాలా.. భోజనం ఇలా తిని చూడండి..!

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>