కలం, వెబ్ డెస్క్: ఈ నెల 23న బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ (TTD) తెలిపింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ శుద్ధి కార్యక్రమం తిరుమల(Tirumala)లో కోయిల్ అళ్వార్ తిరుమంజనం జరగనుంది. దీంతో 23న బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ మేరకు 22న సిఫార్సు లేఖలు తీసుకోమని టీటీడీ తెలిపింది. కోయిల్ అళ్వార్ తిరుమంజనం అనేది వైష్ణవ సంప్రదాయంలో ఆలయంలో జరిగే పవిత్రమైన శుద్ధి కార్యక్రమం.
ఆలయంలోని(Temple) గర్భగుడి (సన్నిధి), విగ్రహాలు, ప్రాకారాలు, గోడలు, స్తంభాలు మొదలైనవాటిని సంపూర్ణంగా శుద్ధి చేస్తారు. “అళ్వార్” అన్నది ఇక్కడ శుద్ధి లేదా పవిత్రత భావాన్ని సూచిస్తుంది. సాధారణంగా బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి వంటి పెద్ద ఉత్సవాలకు ముందు ఈ కార్యక్రమం చేస్తారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచగవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, నీరు మొదలైన వాటితో ఆలయాన్ని శుద్ధి చేస్తారు.
Read Also: అయోధ్య నుంచి ద్వారక వరకు: సప్త మోక్ష నగరాల ఆధ్యాత్మిక ప్రాధాన్యం
Follow Us On: X(Twitter)


