కలం, వెబ్ డెస్క్: బలగం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణు (Venu).. తర్వాత ఎల్లమ్మ(Yellamma) అనే సినిమా చేయాలని కథ రెడీ చేసి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అయితే.. ఇంత వరకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పటి వరకు చాలా మంది హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఫైనల్ గా రాక్ స్టార్ దేవిశ్రీ ఫైనల్ అయినట్టుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇంతకీ.. ఎల్లమ్మ కథ ఏ ఏ హీరోల దగ్గరకు వెళ్లింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?
ఎల్లమ్మ (Yellamma) కథ రెడీ అయిన తర్వాత నానికి ఈ కథ చెప్పారు. కథ విని నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే.. నాని వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో సున్నితంగా దీనికి నో చెప్పాడు. ఆతర్వాత విశ్వక్ సేన్(Vishwak Sen) కి కథ చెబితే అక్కడ కూడా అంతే. కథ నచ్చింది కానీ.. డేట్స్ ఖాళీగా లేకపోవడంతో నో చెప్పాడు. ఆ తర్వాత నితిన్ కి ఈ కథ చెప్పడం.. కథ విని ఓకే చెప్పడం కూడా జరిగింది. తమ్ముడు సినిమా హిట్ అయితే.. ఆ తర్వాత నితిన్(Nithin) తో ఈ సినిమా స్టార్ట్ చేయాలని దిల్ రాజు అనుకున్నారు కానీ.. తమ్ముడు డిజాస్టర్ అయ్యింది.
ఆ తర్వాత ఎల్లమ్మ ప్రాజెక్ట్ అసలు ఉందా..? లేదా..? అనే సస్పెన్స్ లో పడింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్.. ఎల్లమ్మలో లీడ్ రోల్ చేయబోతున్నాడని వినిపించింది. నార్త్ లో మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాని అనౌన్స్ చేస్తారని టాక్. అయితే.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తర్వాత ఈ ప్రాజెక్ట్ దేవిశ్రీ దగ్గరకు వెళ్లింది. అక్కడ ప్రాజెక్ట్ ఓకే అయయిందని సమాచారం. ఇంతకీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే.. కొత్త సంవత్సరంలో ఈ సినిమాని అనౌన్స్ చేయడానికి స్పెషల్ వీడియో రెడీ చేస్తున్నారని టాక్. మరి.. త్వరలో అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.
Read Also: చీరలోనే నాకు కంఫర్ట్.. వెడ్డింగ్ శారీపై అలియా ముచ్చట్లు
Follow Us On: Instagram


