కలం వెబ్ డెస్క్ : కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో జరుగనున్న అటల్ మోడీ సుపరిపాలన యాత్ర(Atal Modi Suparipalana Yatra)లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) సైతం హాజరు కానున్నారు. ఏపీ బీజేపీ(BJP) చీఫ్ పీవీయన్ మాధవ్ సార్థ్యంలో కొనసాగుతున్న బస్సు యాత్ర అనకాపల్లికి చేరుకుంది. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి బండి సంజయ్ ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సహా పలు కార్యక్రమాలు నిర్వహించి, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
Read Also: తెలంగాణ పోలీస్, ఫైర్సర్వీస్ డ్రైవర్ల నియామకంపై సుప్రీం కీలక తీర్పు
Follow Us On : WhatsApp


