92.62 మీటర్ల త్రోతో చరిత్ర సృష్టించిన రుమేశ్ తరంగా

కలం, స్పోర్ట్స్ : రోమ్ డైమండ్ లీగ్‌లో శ్రీలంక జావెలిన్ త్రోయర్ రుమేశ్ తరంగా (Rumesh Tharanga) పతిరాగే సంచలన ప్రదర్శన చేశాడు. 92.62 మీటర్ల త్రోతో టైటిల్ గెలుచుకుని ఆసియా చరిత్రలో రెండో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మార్క్‌తో భారత స్టార్ నీరజ్ చోప్రా (90.23 మీటర్లు), చైనీస్ తైపీ అథ్లెట్ చావో-సున్ చెంగ్ (91.36 మీటర్లు) రికార్డులను అధిగమించాడు. ప్రస్తుతం ఆసియాలో అతడి కంటే ముందున్నది పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల రికార్డు మాత్రమే.

రుమేశ్ (Rumesh Tharanga) రెండో ప్రయత్నంలోనే 92.62 మీటర్ల త్రో నమోదు చేశాడు. ఇది అతడి కెరీర్‌లో తొలి 90 మీటర్లకు పైబడిన త్రో. అలాగే 90 మీటర్ల మార్క్ దాటిన నాలుగో ఆసియా అథ్లెట్‌గా నిలిచాడు. ఇదే పోటీలో భారత అథ్లెట్ సచిన్ యాదవ్ నిరాశపరిచాడు. డైమండ్ లీగ్ అరంగేట్రంలో 79.18 మీటర్ల అత్యుత్తమ త్రోతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నం ఫౌల్ కాగా, మిగతా ప్రయత్నాల్లోనూ ఆశించిన ఫలితం రాలేదు.

పోటీలో అండర్సన్ పీటర్స్ రెండో స్థానం, కర్టిస్ థాంప్సన్ మూడో స్థానం దక్కించుకున్నారు. భారత స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఈ ఈవెంట్‌లో పాల్గొనలేదు. ప్రస్తుతం అతడు స్విట్జర్లాండ్‌లో శిక్షణ పొందుతున్నాడు. పురుషుల జావెలిన్ విభాగంలోని తదుపరి డైమండ్ లీగ్ పోటీ జూన్ 19న దోహాలో జరగనుంది.

Read Also: అఫ్గాన్ టెస్టుకు టీమిండియా సంచలన నిర్ణయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>