Mobile Popup Ad
Mobile Popup Ad

అఫ్గాన్ టెస్టుకు టీమిండియా సంచలన నిర్ణయం

కలం, స్పోర్ట్స్ : అఫ్గానిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియా క్యాంప్ నుంచి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చింది! ఎవరూ ఊహించని విధంగా, యంగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సాయి సుదర్శన్‌ను నంబర్ 3 స్థానంలో బరిలోకి దించుతున్నట్లు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gambhir) అధికారికంగా ప్రకటించారు.

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ (Gambhir) మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో ఏకంగా 700 పరుగులు చేసిన సుదర్శన్‌కు ఇంకా సరైన అవకాశాలు రాలేదని, కేవలం నాలుగైదు మ్యాచ్‌ల ప్రదర్శనతో ఎవరినీ అంచనా వేయలేమని స్పష్టం చేశారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టెస్ట్ మ్యాచ్ ఆడటంపై స్పందిస్తూ, ఆటలో సాకులకు చోటు లేదని, టెస్ట్ క్రికెట్ అంటేనే మెంటల్ టఫ్‌నెస్ అని ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

నిజానికి, టీమిండియా దిగ్గజం ఛెతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఈ నంబర్ 3 స్థానం ఒక మిస్టరీగా మారింది. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్ అయ్యాక నంబర్ 4కి మారడంతో ఈ స్థానం కోసం ఏడుగురు బ్యాటర్లను మార్చినా ఎవరూ సెట్ కాలేదు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన హోమ్ సిరీస్‌లో భారత్ 2-0తో ఘోరంగా ఓడిపోవడానికి ఈ గందరగోళమే ప్రధాన కారణం. ఆ సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్ ఫెయిల్ అవ్వగా, సుదర్శన్ కూడా కేవలం 15, 14 పరుగులకే పరిమితమయ్యారు. ప్రస్తుతం 6 టెస్టుల్లో సుదర్శన్ యావరేజ్ కేవలం 27 మాత్రమే ఉంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 48.15 శాతంతో ఆరో స్థానంలో ఉన్నప్పటికీ, టైటిల్ గెలిచే కసి జట్టులో ఉందని గంభీర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, గంభీర్ నమ్మకాన్ని సాయి సుదర్శన్ ఎంతవరకు నిలబెట్టుకుంటారనేది ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: నార్వే చెస్‌ టైటిల్ రేసులోకి ప్రజ్ఞానంద.. గుకేశ్ చిత్తు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>