కలం, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(Modi), గౌతమ్ అదానీ(Gautam Adani)ల మధ్య ఊహాత్మక సంభాషణను చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏఐ జనరేటెడ్ వీడియో (Congress AI Video)ను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దీంతో రాజకీయ వివాదం రాజుకుంది. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మోడీ-అదానీ భాయ్-భాయ్, దేశ్ బేచ్‌కర్ ఖాయీ మలాయ్’ అనే హెడ్డింగ్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోలో మోడీ.. అదానీకి దేశ సంపదలను అప్పగిస్తున్నట్టు చూపించారు.
దీనిపై బీజేపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసి, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా కోర్టును ఆశ్రయించింది. ఆ ఏఐ వీడియో (Congress AI Video)ను తక్షణమే తొలగించాలని కాంగ్రెస్‌కు గుజరాత్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 17న కాంగ్రెస్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ (@INCIndia) నుంచి వీడియో పోస్ట్ చేయబడింది. 58 సెకన్ల నిడివి గల ఈ ఏఐ వీడియోలో మోడీ, అదానీలు కలిసి ఆఫీస్‌లో మాట్లాడుకుంటున్నట్టు చూపించారు.
Read Also: నల్సార్ చైర్ ప్రొఫెసర్‌గా సుప్రీం మాజీ CJI బీఆర్ గవాయ్
Follow Us On: Pinterest


