కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టుల (Maoists) కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. లొంగిపోబాటు సమయంలో పునరావాస ప్రయోజనాల కింద అందించే పరిహారంతో పాటు అదనంగా నగదు అందించనుంది. తెలంగాణ పునరావ విధానానికి అనుగుణంగా.. డివిజనల్ కమిటీ సభ్యులకు రూ. 5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు రూ.4 లక్షలు, ఒక్కో పార్టీ సభ్యుడి లక్ష రూపాయలను ప్రకటించారు.
వీటితో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం మావోయిస్టు లొంగుబాటు సమయంలో వాళ్లు అప్పగించే ఆయుధాలపై అదనపు రివార్డును ప్రకటించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. LMG (లైట్ మెషిన్ గన్) అప్పగిస్తే.. రూ.5 లక్షలు, AK – 47 కు రూ.4 లక్షలు, INSAS రైఫిల్ కు రూ.2 లక్షలు, SLR (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్) కు రూ.2 లక్షలు, .303 రైఫిల్ కు రూ. లక్ష, UGBL (అండర్ బారెల్ గ్రైనెడ్ లాంచర్ )కు రూ.40 వేలు, 12 బోర్ లేదా సింగిల్ సాట్ గన్ సరెండర్ చేస్తే రూ.30 వేలు నగదు ప్రోత్సాహం అందజేస్తారు.
కాగా, ఈరోజు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన 41 మంది మావోయిస్టులకు (Maoists) పోలీసులు రూ. 1,46,30,000 అందించనున్నారు. తక్షణ సాయం కింద రూ.25 వేలు అందజేశారు. వీటితో పాటు అదనపు ప్రయోజనాలను కూడా ప్రభుత్వం అందిస్తుంచనుంది.
Read Also: అమెరికా సంచలన కేసులో బిల్గేట్స్!
Follow Us On: Youtube


